సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కమాన్‌పూర్(మంథని): పత్తికి మద్దతు ధర పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విన్వియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి సూచించారు. మండలంలోని గొల్లపల్లి శివారులోని పరమేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ముందుగా కాపాస్ యాప్‌లో స్లాట్‌బుక్ చేసుకుంటే ఏ రోజు పత్తి కొనుగోలు చేసే తేదీ, సమయాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. పత్తిలో 8శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుందన్నారు. కమాన్‌పూర్ పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, డైరెక్టర్ గుమ్మడి వెంకన్న పాల్గొన్నారు.
గోదావరిఖని: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలోని 290, 291 బూత్‌లలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే ప్రతి ఓటరు హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
ముత్తారం: ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా ఇంటర్‌మీడియట్ నోడల్ అధికారి డి.కల్పన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలని అధ్యాపకులకు సూచించారు. పరీక్షల్లో విద్యార్థులకు వచ్చే మార్కులు, బోధనా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని, వందశాతం ఫలితాల కోసం అధ్యాపకులు కృషి చేయలన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జీఎల్‌ఎన్‌రావు ఉన్నారు.
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,788 పలికిందని ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్ట ధర రూ.5,371, సగటు ధర రూ.6,571గా నమోదైందని వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 321మంది రైతులు తెచ్చిన 907 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు వివరించారు.
ధర్మారం: ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కిడ్డీబ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు పాఠశాలలో జంకుఫుడ్‌ను నిషేధించారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ దాచిపెట్టుకునేందుకు కిడ్డీబ్యాంకు నిర్వహించుకోవాలని సూచించారు. స్పందించిన విద్యార్థులు కిడ్డీబ్యాంకు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. లంచ్ టైంలో డబ్బులు జమచేయటం, అవసరం ఉన్న వారు తీసుకోవటం జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పొదుపు చేసిన డబ్బులను విద్యార్థులు బుక్స్, పెన్షిల్ అవసరాల కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


