కరీంనగర్‌రూరల్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్– 14 బాస్కెట్‌బాల్ పోటీల్లో బొమ్మకల్‌లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ధులు విక్యాత్, నిత్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికై నట్లు కోచ్ అనూప్ తెలిపారు. విద్యార్థులను బుధవారం ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, వ్యాయామ విభాగం అధిపతి మురళీధర్ అభినందించారు.
నేడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
పెద్దపల్లి: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించనున్నారు. పట్టణ పరిధిలో సుమారు 112 రైస్ మిల్లులు ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో కొనుగోలు చేసే ధాన్యాన్ని సుల్తానాబాద్‌లోని మిల్లులకే అధికంగా తరలిస్తామని, ఇందుకోసం రవాణా, హమాలీలు, కూలీలు తదితర ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా మద్దతు ధర చెల్లిస్తారు. తప్ప, తాలు, మట్టి లేకుండా, నిర్దేశిత తేమశాతంతోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచించారు.
బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక