అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Oct 23 2025 6:35 AM | Updated on Oct 23 2025 6:35 AM

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ధరూర్‌ గ్రామంలో ఈనెల 13న తాళం వేసిన నాలుగిళ్లలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. ధరూర్‌ శివారులోని బైపాస్‌రోడ్‌లో నిందితులు కారులో వెళ్తుండగా 15ఏళ్ల బాలుడితోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ తాలూక దేవిగల్లికి చెందిన మ్యాకల్‌వార్‌ సాయినాథ్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం యామయ్‌కుంటకు చెందిన శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి 24.05 గ్రాముల బంగారు నగలు, రూ.19 వేలు, కారు, రెండు సెల్‌ఫోన్లు, మూడు ఫేస్‌మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లౌస్‌లు, ఓ ఐరన్‌ రాడ్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా బాస్మత్‌ తాలూకా ఖార్ఖానారోడ్‌కు చెందిన మార్కులి అనిల్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుబడిన దొంగలంతా గతంలో జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌, హింగోలి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌, రూరల్‌ ఎస్సై సదాకర్‌, మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌, బీర్‌పూర్‌ ఎస్సై రాజు, ఏఎస్సై సత్తయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, మోహన్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, కిరణ్‌, విశాల్‌, ప్రణయ్‌, ఆంజనేయులు, సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు రివార్డులు అందించారు.

24.05 గ్రాముల బంగారం..

రూ.19 వేలు, కారు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement