
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోని రెండు ఆలయాల్లో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దుర్గామాత ఆలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నవీన్‌కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఎస్సై సూచించారు.