
డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?
ఉన్నత స్థాయిలోనే నిర్ణయాలు
ప్రాజెక్టు స్థాపనే ధ్యేయం
రామగుండం: పట్టణంలో మూతపడిన ఆర్‌టీఎస్–బీ విద్యుత్ కేంద్రానికి చెందిన స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపనపై జెన్‌కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం క్యాబినెట్ సమావేశంలో దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా విద్యుత్ కేంద్రం స్థాపనకు తొలిఅడుగు పడనుంది. ఈవిషయమై పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి పలు అంశాలపై ఇప్పటికే చర్చించారు.
విద్యుత్ కేంద్రం స్థాపనకు అనుకూలం..
మూతపడిన విద్యుత్ కేంద్రం స్థలంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని గతేడాది ఆగస్టు 31వ తేదీన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సమక్షంలో ఇంజినీర్ల బృందం కొత్త విద్యుత్ కేంద్రానికి స్థానికంగా ఉన్న వనరుల లభ్యత, మానవ వనరులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విద్యుత్ మంత్రి భట్టి సంతృప్తి చెందారు.
రూ.10,893.05 కోట్ల వ్యయంతో..
కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనకు రూ.10,893.05 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించారు. ప్రాజెక్టు స్థాపనకు 650 ఎకరాలు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఏటా విద్యుత్ వినియోగానికి 3.053 మిలియన్ టన్నుల బొగ్గు, గంటకు 2,365 క్యూబిక్ మీటర్ల నీరు(ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి) వినియోగం ఉంటుందని ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ఆస్తులు, మానవ వనరులు..
గతేడాది సందర్శించిన విద్యుత్‌శాఖ మంత్రికి నివేదించిన గణాంకాల ప్రకారం.. బీ–థర్మల్ విద్యుత్, ఉద్యోగుల క్వార్టర్లతో కలిపి భూములు 700.24 ఎకరాలు కాగా ప్రస్తుతం 580.09 ఎకరాలు మాత్రమే క్లియర్‌గా ఉన్నట్లు తెలిసింది. జెన్‌కో భూముల్లోనే పోలీస్‌స్టేషన్, పోస్టాఫీస్, ఈఎస్‌ఐలో కొంత స్థలం, మున్సిపల్ శాఖ, ఎస్‌టీపీలు ఉండగా, 90 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. బీ–థర్మల్ ఉద్యోగులు 323 మంది కాగా వైటీపీఎస్ బదిలీ వెళ్లిన ఉద్యోగులను తీసివేసేత 225 మంది స్థానికంగా ఉన్నారు. ఇంజినీర్లు–52, కెమిస్ట్ ఒకరు, ఓఅండ్‌ఎం–80, అకౌంట్స్ సెక్షన్–17, పర్సనల్(జనరల్)–12, ఫైర్ సేఫ్టీ–8, జెన్‌కో కానిస్టేబుళ్లు–14, ఆర్టిజన్లు–49 మంది ఉన్నారు.
గతేడాది జూన్ 4న మూతపడిన విద్యుత్ కేంద్రం..
సుమారు 16 నెలల క్రితం మూతపడిన విద్యుత్ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన 98 మందిని యాదాద్రికి బదిలీ చేశారు. మిగతా ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు స్థానికంగా ఉండగా వారికి నెలవారీ జీతాల కింద సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా విధులు నిర్వహించని షిఫ్ట్ ఉద్యోగులకు అలవెన్సులు చెల్లిస్తుండడంపై యాదాద్రికి బదిలీపై వెళ్లిన ఉద్యోగులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ అలవెన్సులు చెల్లించడం లేదని, మూతపడిన కేంద్రంలోని ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సులు చెల్లించడం ఏమిటని బదిలీపై వెళ్లిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జెన్‌కో ఇంజినీర్లతో విద్యుత్‌శాఖ మంత్రి భట్టి (ఫైల్)
ఎమ్మెల్యేతో సమావేశమైన ఇంజినీర్లు (ఫైల్)
మేము కేవలం స్థానికంగా విద్యుత్ భద్రత పర్యవేక్షకులుగా కొనసాగుతున్నాం. కొద్దిమంది ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నాం. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపన, ఇతరత్రా అంశాలన్నీ ఉన్నతస్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి.
– దాసరి శంకరయ్య, ఇన్‌చార్జి ఎస్‌ఈ, బీ–థర్మల్
క్యాబినెట్ సమావేశంలో కొ త్త విద్యుత్ కేంద్రం డీపీఆర్ కు తప్పకుండా ఆమోదము ద్ర పడుతుందని ఆశిస్తు న్నా. ఆ తర్వాత ప్రస్తు తం ఉన్న కేంద్రాన్ని స్క్రాప్‌కు తరలించి కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపన నా ముఖ్య ధ్యేయం. – మక్కాన్‌సింగ్ ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం

డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?

డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?

డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?

డీపీఆర్‌కు మంత్రివర్గం సానుకూలమేనా?