
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. శ్రీలలితసేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో దీపాలు వెలిగించారు.
రాజన్న ఆలయంలో ఆకాశదీపం
కార్తీకమాసం సందర్భంగా రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపాన్ని ఆలయ అర్చకులు వెలిగించారు.
అభిషేక ప్రియుడికి కోటి దండాలు
వేములవాడ: రాజన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రాజన్న, భీమన్న ఆలయాల్లో దర్శనాలు, కోడెమొక్కులు కొనసాగాయి. రాజన్న ఆలయంలో అభిషేకాలు అత్యధికంగా జరిగాయి. ఆలయంలో పనులు జరుగుతుండడంతో గంటసేపు దర్శనాలు నిలిపివేశారు. ఏర్పాట్లను ఈవో రమాదేవి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్ పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

వైభవంగా కార్తీక దీపోత్సవం

వైభవంగా కార్తీక దీపోత్సవం