
వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
పాలకుర్తి(రామగుండం): ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు దోమపోటు సోకడంతో కాపాడుకునేందుకు ప్రయత్నించి విసుగుచెందిన రైతు.. చివ రకు పంటకు నిప్పు పెట్టిన సంఘటన పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన రైతు పర్శవేన శ్రీనివాస్ తన రెండెకరాల్లో ఈసారి సన్నరకం వరి వేశాడు. దాదాపు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మరికొద్దిరోజుల్లో పంట కోసేందుకు సిద్ధమయ్యాడరు. ఈక్రమంలో వరికి దోమపోటు సోకింది. నాలుగుసార్లు పురుగులమందు పిచికారీ చేశాడు. అయినా.. దో మపోటు అదుపులోకి రాలేదు. విసుగుచెందిన రై తు.. బుధవారం పంటకు నిప్పుపెట్టాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చివరిదశలో ఉండగా సోకిన తెగులుతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థి తి లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.