
ప్రాజెక్టుల ల్యాండ్‌మార్క్ మిడ్‌మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్‌మార్క్‌లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్‌మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్‌లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్‌స్లూయిస్‌ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్‌వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు.

ప్రాజెక్టుల ల్యాండ్‌మార్క్ మిడ్‌మానేరు