
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి
కోల్‌సిటీ(రామగుండం): పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు డివిజన్లలో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గోళాల్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. స్థానిక పల్లెదవాఖానను సందర్శించి జ్వర పీడితుల వివరాలు సేకరించారు. పలు డివిజన్లలో పిచ్చిచెట్లు, పొదలు తొలగించారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌బాల్స్ వేయడంతోపాటు డివిజన్లలో ఫాగింగ్ చేశారు. గోదావరిఖని బస్టాండ్ ఏరియా పరిసరాలు పరిశుభ్రం చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, మెప్మా సీవో ఊర్మిళ, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, ఆర్పీలు, స్వశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు.