
ఇబ్బందుల్లేకుండా ఇళ్ల నిర్మాణం
● ‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం ● లబ్ధిదారులకు ప్రోత్సాహం
● నిర్మాణ దశను బట్టి చెల్లింపులు ● వెసులుబాటు కోసమే విస్తీర్ణం నిబంధన
● ‘సాక్షి’తో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్
‘కమిటీ సభ్యులు రూపొందించిన జాబితాను కలెక్టర్ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నా యి. జిల్లాకు 9,427 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, అందులో 6,018 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఇందులో 3,747 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే పేదలు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకునేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అందుకోసమే ఇటుక(ఒక్కోదాని ధర రూ.5.50), ఇసుక ధరలు తగ్గించారు. మేస్త్రీ, సెంట్రింగ్ చార్జీలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు ఆర్డీవో, హౌసింగ్ పీడీలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా బిల్లుల చెల్లింపులు, ఇతర సందేహాలు నివృత్తి చేస్తున్నాం.. పనుల్లో వేగం పెంచుతున్నాం’ అని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు.. – పెద్దపల్లిరూరల్

ఇబ్బందుల్లేకుండా ఇళ్ల నిర్మాణం