
మా పోరాట ఫలితమే..
సుమారు ఏడేళ్లుగా జేఎంఈటీలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మేం గుర్తింపు యూనియన్‌గా ఎన్నికై న తర్వాత యాజమాన్యంతో పట్టుపట్టడంతో మార్గం సుగమమమైంది. వచ్చిన ఉద్యోగాలు కాపాడుకోవాల్సిన బాధ్యత జేఎంఈటీలపైనే ఉంది.
– వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ
సంతోషంగా ఉంది
2013లో జేఎంఈటీగా జాయిన్ అయి 2023 వరకు కాసిపేట–2 గనిలో పనిచేశా. తిర్యాణి మండలం గంభీరావుపేట స్వగ్రామం. వృత్తి లో అనుభవం ఉన్నా సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆలస్యమై ఉద్యోగం కోల్పోయా. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. – దానెపల్లి నిశాంత్, తిర్యాణి, మందమర్రి
సర్టిఫికెట్లు లేక పోయింది
మైనింగ్ డిప్లొమాచేసి 2016లో జేఎంఈటీగా ఉద్యోగం సాధించా. ఐదేళ్లపాటు ఆర్కే న్యూటెక్‌లో యాక్టింగ్ ఓవర్‌మెన్‌గా పనిచేశా. సకాలంలో సర్టిఫికెట్లు అందించక ఉద్యోగం పోయింది. ఐదేళ్లుగా ఉద్యోగం లేదు. మళ్లీ ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది.
– మాదరబోయిన దీక్షిత్, జేఎంఈటీ, గోదావరిఖని

మా పోరాట ఫలితమే..

మా పోరాట ఫలితమే..