
● జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు ● ఊపందుకున్న సాగు ప
సాక్షి, పెద్దపల్లి: అదనుదాటుతున్నా సమృద్ధి వర్షా లు కురవక కలవరపడిన అన్నదాతలు.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వానలతో ఊరట చెందుతున్నారు. కుంటలు, చెరువులు, ప్రాజక్టుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటి ఎదురుచూస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన వానలు కురవక అన్నదాతలు మొన్నటిదాకా నిరాశలో ఉన్నారు. నేలలో పెట్టిన పత్తి విత్తనాలు మొలకెత్తక భయంగా ఉన్న రైతులు.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో వారంపాటు ఇదేరీతిలో వానలు కొడితే వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు.
పలు మండలాల్లో ఇంకా లోటు వర్షాపాతమే
జిల్లాలో 387.6 మి.మీ. వర్షపాతం కురువాల్సి ఉండగా, ఇప్పటివరకు 287.5 మి.మీ. వర్షపాతమే కురిసింది. జిల్లాలో 13 మండలాలు ఉండగా.. అందులోని కొన్ని మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. కమాన్‌పూర్, సుల్తానాబాద్, ఓదె ల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో సా ధారణ వర్షపాతం కురవగా, మిగిలిన మండలాలు లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రామగిరి, మంథని, రామగుండం, పాలకుర్తి మండలాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. జిల్లాలో 1,017 చెరువులు ఉండగా ఇప్పటి వరకు 6 చెరువులే మత్తడి పోస్తున్నాయి. మరో 42 చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వెలవెల..
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టకు ఇంకా ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో రావడంలేదు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండక, మహారాష్ట్రలో భారీ వర్షాలు లేక నాలుగు రోజుల నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో కొంత వరద మాత్రమే వస్తోంది. 3,651 క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో 20.17టీఎంసీల నిల్వసామర్థ్యం గల ఎల్లంపల్లికి ఇప్పటివరకు 9.32 టీఎంసీల నీరు మాత్రమే నీరు నిల్వ ఉంది. గతేడాది 13.53 టీఎంసీలుండగా, ఈయేడాది లోటు వర్షపాతంతో గతేడాదిలో పోల్చితే 4.21 టీఎంసీల నీరు తక్కువగా నమోదైంది.
పెద్దపల్లి మండలం కొత్తపల్లి శివారులోని చెరువు కింద పొలాల్లో వరినాట్లు వేస్తున్న కూలీలు, రైతులు
జిల్లాలో వర్షాపాతం(మి.మీ.లలో)
ధర్మారం
18
పాలకుర్తి
9.8
అంతర్గాం
0.6
రామగిరి
23.7
కమాన్‌పూర్
19.9
పెద్దపల్లి
10.8
జూలపల్లి
16.3
ఎలిగేడు
12.2
సుల్తానాబాద్
11.6
ఒదెల
12.7
ముత్తారం
25.9
మంథని
22.1
వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో)
సాగు అంచనా 2,76,076
ఇప్పటివరకు సాగైన వరి 93,380
మొక్కజొన్న 241
పత్తి 47,555
ఇతర 73