ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

Jul 26 2025 10:18 AM | Updated on Jul 26 2025 10:18 AM

ప్రణా

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

జూలపల్లి(పెద్దపల్లి): పదోతరగతి విద్యార్థుల కు డిజిటల్‌ క్లాసులను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా విధ్యాధికారి మాధవి సూచించారు. తెలుకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు క్రీడాదుస్తులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌ ఉన్నారు.

ఏఎంసీ పాలకవర్గాలు ఖరారు

మంథని/కమాన్‌పూ ర్‌: మంథ ని డివిజన్‌ లోని మంథని, క మాన్‌పూ ర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించింది. మంథని ఏఎంసీ చైర్మన్‌గా వెంకటాపూర్‌ గ్రా మానికి చెందిన మాజీ ఎంపీటీసీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కుడుదుల వెంకన్న, కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌గా వైనాల రాజుకు చోటు కల్పించారు. రాజు కమాన్‌పూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన ము స్కుల ప్రశాంత్‌రెడ్డికి వైస్‌ చైర్మన్‌గా, కమాన్‌పూ ర్‌ ఏఎంసీలో ముత్తారం మండలానికి చెందిన మద్దెల రాజయ్యను వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఒక్కో మార్కెట్‌ కమిటీకి 16 మంది చొప్పున సభ్యులను నియమించారు. కాగా రెండు మార్కెట్‌ కమిటీలు జనరల్‌ రిజర్వు ఉండగా బీసీలకు అవకాశం కల్పించారు.

నూతన కార్యవర్గం

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా భోగ శ్రీ నివాస్‌ను ఎన్నుకున్నారని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ అధ్యక్షుడు ఆనంద్‌, ప్రధాన కార్యదర్శి కుమా రస్వామి తెలిపారు. మండల కేంద్రంలో శుక్ర వారం ఎన్నికలు నిర్వహించారన్నారు. ప్రధాన కార్యదర్శిగా గసిగంటి ఆనంద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భూక్య గ్యాంగ్య నాయక్‌, కోశాధికారిగా పి.రవీందర్‌, డివిజన్‌ అధ్యక్షుడిగా కనుమల్ల రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా సిపల్లి నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా కాంపల్లి సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నేరుపట్ల నర్సింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పేర్కొన్నారు.

‘నానో’ యూరియాతో మేలు

పెద్దపల్లిరూరల్‌: నానో యూరియా ఎంతోమే లు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివా స్‌ అన్నారు. రాఘవాపూర్‌ రైతువేదికలో శుక్రవారం ఇఫ్‌కో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ డీఏ శ్రీ నాథ్‌, ఏవో అలివేణితో కలిసి పాల్గొన్నా రు. 500 మి.లీ. నానో యూరియా 45 కిలోల యూరియాకు సమానమన్నారు. ధర కూడా త క్కువగానే ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి, ఎలిగేడు మండలాల వ్యవసాయాధికారులు ఉన్నారు.

ప్రియాంకను కలిసిన నేతలు

ధర్మారం(ధర్మపురి): కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొ టో ముద్రించేలా చూడాలని అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి నాయకులు కోరారు. ఈమేరకు సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి ఆ ధ్వర్యంలో పార్లమెంట్‌ భవనం ఎదుట ప్రి యాంకను శుక్రవారం నాయకులు కలిశారు.

పింఛన్‌ పెంపుకోసం పోరు

పెద్దపల్లిరూరల్‌/గోదావరిఖనిటౌన్‌: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఎ మ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. పెద్దపల్లి దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, గోదావరిఖనిలో సింగరేణి మాదిగ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఏ ర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడా రు. దివ్యాంగులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మో సం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు చెల్లించాల్సిన సొమ్మును రైతుభరోసాకు మళ్లించడం అన్యాయమని దుయ్యబట్టారు. దళిత, బీసీ, మైనారిటీల హక్కుల కోసం ప ఉంటానని అభయం ఇచ్చారు. వెంకటేశ్‌నేత, కాసిపేట లింగయ్య పాల్గొన్నారు.

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు1
1/4

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు2
2/4

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు3
3/4

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు4
4/4

ప్రణాళిక ప్రకారం డిజిటల్‌ క్లాస్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement