
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ల నిరీక్షణకు తెర
● తొలగించిన 43 మంది జేఎంఈటీలకు మళ్లీ ఉద్యోగాలు ● యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్‌తో కుదిరిన అంగీకారం ● నియామక లేఖ అందించిన డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్
గోదావరిఖని: ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న డిస్మిస్డ్ జే ఎంఈటీలకు శుభవార్త అందింది. గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం అంగీకారం మే రకు విధుల నుంచి తొలగించిన 43 మందికి జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ)ల పునర్నియామకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో డిస్‌మిస్ అయ్యారు. వీరి అభ్యర్థన మే రకు హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిష నర్ కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం, గు ర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య ఈనెల 24న అంగీకారం కుదిరింది. జేఎంఈటీలు సరైన విధంగా విధులకు హాజరు కాకపోవడం, విధుల్లో చేరిన తర్వాత ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ సర్టిఫికె ట్ సకాలంలో సమర్పించకపోవడంతో యాజమా న్యం వారిని విధుల నుంచి తొలగించింది. వీరి విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించాలని గుర్తింపు కార్మిక సంఘం కోరింది. ఈమేరకు గతేడాది నవంబర్‌లో జరిగిన డైరెక్టర్(పా) స్థాయి నిర్మాణాత్మక సమావేశం, ఆ తర్వాత.. ఈఏడాది మార్చిలో జ రిగిన సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలో అజెండాగా చేర్చి చర్చించారు. దీనిపై గత నెల27న డైరె క్టర్(పా)స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలోనూ చర్చించి ఒక ద్వైపాక్షిక అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత యూనియన్ నాయకులు, డి ప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోసారి చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించారు. ఈ అంగీకార కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు, సింగరేణి యాజమాన్యం తరఫున సీపీపీ జీఎం మ నోహర్, జీఎం(పర్సనల్) కవితానాయుడు, హెచ్ వోడీ(ఎంఎస్) రవి బొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్, నాయకులు కె.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, వైవీ రావు పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు సమర్పించాల్సిందే..
ఉద్యోగం నుంచి తొలగింపుకు గురై పునర్‌నియామకం అయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీలను తాజా నియామకం చేసినట్లు గుర్తించనున్నారు. సంస్థ ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ ముందు తమ సర్వీసు విషయాలు, ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రాథమిక అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయనున్నారు. ఉద్యోగంలో తొలిఏడాదిలో తప్పనిసరిగా 190 మస్టర్లు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.