
కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశానికి రోల్‌మోడల్‌గా మారుతోందని, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏఐసీసీ అదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే మెంబర్ షిప్ విషయంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారని అదే స్ఫూర్తితో లోకల్‌బాడీ ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్, పార్టీ పదవుల్లో పెద్దపీట ఉంటుందన్నారు. తెలంగాణ సంపదను దోచుకోని లక్షల కోట్లు లూటీ చేసిన కేసీఆర్‌కు రాష్ట్రంలో స్థానం లేదన్నారు. జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రుద్ర సంతోష్, సత్తు మల్లేశం, రహమతు హుస్సేన్, వైద్యుల అంజన్ కుమార్, వెలిచాల రాజేందర్‌రావు, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఒడితెల ప్రణవ్, వి.నరేందర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌ను ప్రధాని చేద్దాం
దేశంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతోందని, రాబోయే రోజుల్లో మోదీని గద్దె దించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలన గాడి తప్పిందని, 11ఏళ్లుగా ప్రజలను మభ్యపెట్టడం తప్పా బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకు ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ బండారాన్ని ఎండగట్టండి
పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు నిఖార్సయిన కార్యకర్తలకే
ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అద్దంకి దయాకర్