
డీఏవోగా శ్రీనివాస్
పెద్దపల్లిరూరల్: జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో)గా శ్రీఽనివాస్ మంగళవారం ఉద్యోగ బా ధ్యతలు స్వీకరించారు. హుస్నాబాద్ ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు డీడీఏగా పదోన్నతి కల్పించి పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారిగా నియమించారు. ఇక్కడ పనిచేసిన డీఏవో ఆదిరెడ్డిని హన్మకొండ ఏడీఏగా బదిలీ చేశారు.
అందరూ సహకరించారు
జిల్లా వ్యవసాయ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని బదిలీపై వెళ్తు న్న డీఏవో ఆదిరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో ఏ ర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త డీఏవో శ్రీనివాస్, ఏవో వైదేహి, ప్రకాశ్‌రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
‘భట్టి’ వ్యాఖ్యలపై నిరసన
పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆ గ్రహం వ్య క్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత మోర్చా రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశిపేట శివాజీ, నాయకుడు ఈర్ల శంకర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. 2016లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యతో సంబంధం లేకున్నా రాంచందర్‌రావు పేరును డిప్యూటీ సీఎం ప్రస్తావించడం శోచనీయమన్నారు. చిలారపు పర్వతాలు, పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్, సంపత్, కారంగుల శ్రీ నివాస్, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, మేకల శ్రీనివాస్, రాజగోపాల్, శ్రీకాంత్, కిరణ్, సతీశ్, సోడాబాబు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మేజిక్ షో
కోల్‌సిటీ(రామగుండం): కర్చీప్‌ను జాతీయ జెండాగా మార్చడం.. తెల్లకాగితాన్ని రూ.500 నోటుగా మార్చడం.. ప్లాస్టిక్‌బాల్‌ను మాయం చేయడం.. చెవిలో పెట్టిన దారాన్ని ముక్కులోంచి తీయడం తదితర మేజిక్ ప్రదర్శలు ఆక ట్టుకున్నాయి. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ మంగళవారం చేపట్టిన ప్రదర్శనలు అబ్బురపర్చాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో మేజిక్ ప్రదర్శలు ఇస్తూ ఉపాధి పొందుతున్నట్లు షబ్బీర్ తెలిపారు.
దివ్యాంగులకు ఉపాధి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగు ల కోసం 21 స్వయం ఉపాధి యూనిట్లు మంజూరయ్యాయని జిల్లా దివ్యాంగ సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్ తెలిపారు. వ్య వసాయ అనుబంధ పరిశ్రమలు, సేవా, వ్యా పారం ద్వారా ఆదాయం పొందేలా ప్రోత్సహం అందిస్తున్నామన్నారు. ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా లని, వివరాలకు 94408 52495 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
నియామకం
పెద్దపల్లిరూరల్: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా గండు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేర కు యూనియన్ ఉత్తర్వులు జారీచేసింది.

డీఏవోగా శ్రీనివాస్

డీఏవోగా శ్రీనివాస్