
అన్ని రంగాల్లో అగ్రగామి రామగుండం
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతా న్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గోదావరి తీ రంలోని సమ్మక్క గద్దెల వద్ద మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎప్‌సీఎల్, మున్సిప ల్ సహకారంతో సమ్మక్క గద్దెల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రూ.4 కోట్లతో గోదావరి తీరంలోని శ్మశానవాటిక లో స్మృతివనం, గ్రావియట్ నిర్మాణాలు, ఇతర సౌ కర్యాలు కల్పిస్తామన్నారు. రూ.కోటితో ఈద్గాలను అభివృద్ధి చేస్తామని, క్రిష్టియన్ ఫంక్షన్‌హాల్ నిర్మిస్తామన్నారు. అనంతరం బల్దియా కార్యాలయం ఎ దుట జరిగిన సింగరేణి చేపట్టిన వనమహోత్సవంలో ఆయన మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ అ రుణశ్రీ, ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్, జాతర క మిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, బంగారు చిన్నరాజయ్య, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజి రెడ్డి, ఆసిఫ్ పాషా, పి.ఎల్లయ్య పాల్గొన్నారు.
బల్దియా అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కోల్‌సిటీ(రామగుండం): బల్దియా ఇంజినీర్ల పనితీరుపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై అలసత్వం వీడాలని హెచ్చరించారు. రాజకీయం చేయడం మానుకోవాలని హిత వు పలికారు. ఓ అధికారి వ్యవహారంపై కూడా ఎ మ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. వనమహోత్సవంలో ప్రధాన రహదారి వెంట మొ క్కలు నాటిన అనంతరం బల్దియా కమిషనర్ అరు ణశ్రీతో కలిసి ఎమ్మెల్యే సమావేశమై పలు సూచనలు చేశారు. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాను న్న దృష్ట్యా ఎన్నికల కోడ్ కన్నా ముందే శంకుస్థాపనలు చేయాలని సూచించారు. నగరంలో విలీనమై న లింగాపూర్ వైపు పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహా లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తర్వాత సెల్ఫీ పాయింట్‌లో ఆయన ఫొటో దిగారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్