
ఇంటింటా ఫీవర్ సర్వే చేయాలి
● రెండు నెలలపాటు అప్రమత్తంగా ఉండాలి ● బల్దియా, వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలి ● రామగుండం బల్దియా కమిషనర్ ఆరుణశ్రీ ఆదేశాలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం బల్దియాలోని ప్రజారోగ్యం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి అన్న ప్రసన్న కుమారితో కలిసి మాట్లాడా రు. అధికారులు, సిబ్బంది ఈ రెండు నెలలు అ ప్రమత్తంగా ఉండాలన్నారు. అంటువ్యాధులు ప్ర బలకుండా నగరపాలక సంస్థ, వైద్య, ఆరోగ్య శా ఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాని ఆదేశించారు. ఇంటింటినీ సందర్శించి జ్వర సర్వే చేయాలన్నారు. ఇదేసమయంలో పారిశుధ్య సమస్యలు గుర్తించి ప్రజారోగ్య విభాగం దృష్టికి తీసురావాల ని కమిషనర్ సూచించారు. రెండు విభాగాల సిబ్బంది ఫోన్‌నంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగీ అనుమానిత కేసులు వస్తే బల్దియా సిబ్బందికి సమాచారం అందించాలని, తద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపతామని తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భా గంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాగునీటిలో క్లోరినేషన్, నిల్వనీటిని నీరు తొలగించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్, చేయడం, ఆ యిల్ బాల్స్ వదలడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, పట్టణ ఆరోగ్యకేంద్రాల మెడికల్ ఆఫీస ర్లు మణికేశ్వర్‌రెడ్డి, సాదిక్ పాషా, అహల్య, పద్మ, రమణి, దీవెన, స్నేహాలత, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, కుమారస్వామి, జూనియ ర్ అసిస్టెంట్ శంకర్‌స్వామి, మెప్మా టీఎంసీ మౌ నిక, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.