
పర్యావరణాన్ని కాపాడాలి
రామగుండం: ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించినప్పుడే పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారవుతారని జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య అన్నారు. గురువారం వన మహోత్సవంలో భాగంగా అంతర్గాం జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీవీబీ విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఏటా ముమ్మరంగా మొక్కలు నాటినా వాటి సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మొక్కల ఎదుగుదల లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దకాలం క్రితం పోల్చితే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి.సతీశ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కొమురయ్య, దేవదాస్, జిల్లా స్రైక్ ఫోర్స్ అధికారి సయ్యద్ రహ్మతుల్లా, సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, మిర్జా ఇర్షద్, మేఘరాజ్, స్రవంతి, ఎంపీడీవో వేణుమాధవ్, ఏపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.