
కోర్టు ఆవరణలో డిస్పెన్సరీ ప్రారంభం
పెద్దపల్లిరూరల్: జిల్లా న్యాయస్థాన ఆవరణలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి, బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. గవర్నమెంట్ ప్లీడర్ మార కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవన నిర్మాణ స్థలం పరిశీలన
ఓదెల(పెద్దపల్లి): ఓదెలలో కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని గురువారం సుల్తానాబాద్ జడ్జి గణేశ్ పరిశీలించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల ప్రజల సౌకర్యార్థం కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలం స్థితిగతులను తెలుసుకున్నారు. తహసీల్దార్ కె.ధీరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని డివిజన్లలో సర్వే చేయండి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో వీధి వ్యాపారుల సౌకర్యార్థం వెంటనే వెండింగ్ జోన్లు గుర్తించాలని కమిషనర్ (ఎఫ్‌ఎసీ) జె.అరుణశ్రీ అన్నారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన టౌన్‌వెండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థలో నూతన గ్రామాలు విలీనమైన నేపథ్యంలో మెప్మా, పట్టణ ప్రణాళికా విభాగం, ట్రాఫిక్ పోలీస్‌శాఖ సంయుక్తంగా సర్వే చేయాలన్నారు. ఈ సర్వేలో డివిజన్ల వారీగా రెడ్, గ్రీన్, అంబర్ వెండింగ్ జోన్లు గుర్తించాలన్నారు. వీధి వ్యాపారుల జాబితాలో అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన వీధి వ్యాపారులు పడకుండా, బ్యాంకుల సహకారంతో పీఎం స్వనిధి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ట్రాఫిక్ సీఐ బి.రాజేశ్వర్‌రావు, టౌన్‌ప్లానింగ్ విభాగం ఏసీపీ శ్రీహరి, టీపీవో నవీన్, ఆర్‌వో ఆంజనేయులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ఎలిగేడు(పెద్దపల్లి): ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీడీ సత్యనారాయణ అన్నారు. 01–04–2024 నుంచి 31–3–2025 వరకు జరిగిన ఉపాధి పనులపై గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2024–25లో పంటపొలాలకు రోడ్లు, చెరువుల పూడికతీత, తదితర రూ.3,38,35,606 విలువైన పనులు చేయగా అందులో కూలీలకు రూ.2,07,23,288, స్కిల్డ్ కింద రూ.93,000, మెటీరియల్‌కు రూ.1,30,19,318 చెల్లించారు. ఈసందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ, పని అడిగిన ప్రతీ ఒక్కరికి జాబ్‌కార్డు అందించాలని, ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడకుండా, పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పనుల్లో చిన్నచిన్న పొరపాట్లను గుర్తించిన అధికారులు రూ.13,024 రికవరీకి ఆదేశించారు. అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొమురయ్య, ఎంపీడీవో భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కోర్టు ఆవరణలో డిస్పెన్సరీ ప్రారంభం

కోర్టు ఆవరణలో డిస్పెన్సరీ ప్రారంభం

కోర్టు ఆవరణలో డిస్పెన్సరీ ప్రారంభం