
సమష్టి కృషితో లక్ష్యాలు సాధించాలి
రామగిరి: సమష్టి కృషితో నిర్వేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్) గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం ఆర్జీ–3 , ఏపీఏ గనిలో పర్యటించారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీఎంలు నరేంద్ర సుధాకర్‌రావు, కొలిపాక నాగేశ్వరరావు, వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను డైరెక్టర్‌కు జీఎంలు వివరించారు.
గనిలోకి దిగిన డైరెక్టర్
అతిపెద్ద భూగర్భ గని అయిన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు ఏరియాలో గురువారం డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు పర్యటించారు. ముందుగా ఏపీఏ గని ఆవరణలో మొక్కనాటారు. అనంతరం మ్యాన్ రైడింగ్ ద్వారా భూగర్భ గనిలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న యంత్రాల పనితీరును పరిశీలించారు. అధికారులు కె.యాదయ్య, ఎం.రామ్మోహన్, బండి సత్యనారాయణ, జే.రాజశేఖర్, సీహెచ్.వెంకటరమణ, ప్రవీణ్ వి ఫాంటింగ్, బి.సుదర్శనం, గుర్రం శ్రీహరి, మేఘన, టి.రఘురాం, సునీల్‌కుమర్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.