
సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయాలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, నాయకులు జాని, అబ్బయ్యగౌడ్, దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే విజయరమణారావు