
ఆరుగురు పిల్లలతో ఆనందంగా..
కోల్‌సిటీ(రామగుండం): మాది పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామం. 1987లో నాకు పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగం రావడంతో, భార్య లక్ష్మితో గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియాకు వలసొచ్చినం. అప్పటికే మాకు నలుగురు కొడుకులు రాజు, సదానందం, మల్లేశ్, ప్రదీన్‌తోపాటు కూతురు విజయ ఉన్నారు. గోదావరిఖనికి వచ్చాక చిన్న కొడుకు శ్రీనివాస్ పుట్టాడు. ఆరుగురు పిల్లలను చదివించి ఏ కష్టం రాకుండా పెద్దవాళ్లను చేశాం. 2020లో రిటైర్డ్ అయ్యాను. చిన్న కొడుకు తప్ప, అందరికీ పెళ్లిల్లు చేశాం. కోడళ్లు, అల్లుడు, మనమలు, మనమరాళ్లతో సందడిగా ఉంటుంది. ఇల్లు సరిపోకపోవడంతో దగ్గర్లోనే పిల్లలందరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, ఏ పండుగైనా, వేడుకలైనా కలిసి చేసుకుంటాం. కలిసి వంటలు చేసుకొని సంబరంగా కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా గడుతున్నాం.
– దుడపాక నర్సయ్య, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని