
ఒక్కరైతే మంచి లైఫ్ ఇవ్వొచ్చు
కోల్‌సిటీ(రామగుండం): కుటుంబంలో పిల్లలను ఎక్కువగా కనడం ద్వారా ఇంటి పెద్ద చేస్తున్న ఉద్యోగానికి వేతనాలు సరిపోకపోతే ఆర్థిక ఇబ్బందులతో వారికి మంచి జీవితాన్ని కల్పించకపోవచ్చు. ఒక్కరు, లేదా ఇద్దరు పిల్లలుంటే వారికి మంచి లైఫ్‌ను ఇవ్వొచ్చు. ఇదే విషయాన్ని నేను, భార్య ఫర్వీన్ కూడా నమ్మినం. మాకు పాప అయినా, బాబు అయినా ఒక్కరైతే చాలనుకున్నాం. అదృష్టం కొద్ది మాకు పాప పుట్టింది. మా పాపను డాక్టర్ చదివించాం. ఇప్పుడు హైదరాబాద్ కిమ్స్‌లో డాక్టర్‌గా సేవలందిస్తోంది. చాలా కుటుంబాలు ఎక్కువ పిల్లలను కని ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నాయి. – ఎండీ ఆసీఫ్, సింగరేణి ఓసీపీ–2 అడిషనల్ మేనేజర్, గోదావరిఖని