
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
ముత్తారం(మంథని): మండలంలోని పలు గ్రా మాల్లో గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. మచ్చుపేట, లక్కారం, పారుపల్లి, అ డవిశ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. బోధ న, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రైవేట్ కు దీటుగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న చెంచుల ఇళ్లు, అడవిశ్రీరాంపూర్ టీఫైబర్ ఇంటర్నేట్ ద్వారా నడుస్తున్న డిజిటల్ క్లాసు ను పరిశీలించారు. మచ్చుపేటలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తూ అర్హులకు మంజూరు చేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని పల్లె దవాఖా నాను సందర్శించి స్థానికంగా ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ముత్తారంలోని ఐకేపీ రుద్రమ మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో చిల్లి తయారినీ పరిశీలించారు. డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవో సురేశ్, ఏపీఏం పద్మ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష