
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
సుల్తానాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధ కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనను గజమాలతో సన్మానించారు. మెజార్టీ సీట్లు గెలవడం కోసం సమష్టిగా పోరాడాలని సంజీవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రూపు తగాదాలు లేకుండా ఐక్యంగా ముందుకు వెళ్తే విజయం తధ్యమన్నారు. అంతకు ముందు ఆయన పలు ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమాలలో పార్టీ జిల్లా కార్యదర్శి మహేందర్ యాదవ్, నాయకులు కామాని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కూకట్ల నాగరాజు, కొల్లూరి సతీశ్ కుమార్, అన్వేశ్, ఎల్లెంకి రాజన్న, గుడ్ల వెంకటేశ్, పవన్, సతీశ్, పల్లె తిరుపతి, సదయ్య, శేఖర్, కుమార్, సతీశ్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.