
అమ్మకు ఆరోగ్యం.. పిల్లలకు చదువు..
కలెక్టర్లు సాధారణంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పైళ్లు క్లియర్ చే యడం, విజిట్స్, ఇతర కార్యకలాపాలతో బిజీగా గడుపుతారు. కానీ.. కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి మాత్రం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చిన్నారుల మానసిక వికాసం కోసం ‘ఏ టూ జెడ్ నాణ్యమైన రైమ్’ పేరిట రైమ్ రాసి పిల్లల కోసం పాడారు. ప్రతీ అక్షరం ప్రాముఖ్యతను తెలిపేలా.. ఏ ఫర్ ఆక్టివ్, బీ ఫర్ బ్రైట్.. అంటు జెడ్ వరకూ అన్ని అక్షరాలను ఉపయోగించి రైమ్ విడుదల చేశారు. అలాగే ‘శుక్రవారం సభ’ పేరుతో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషణలోపం గల చిన్నారులు, రక్తహీనత ఉన్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. ఉచిత పరీక్షల ద్వారా మహిళలకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా భరోసా ఇస్తూ చేపట్టిన కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధించింది. అలాగే జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి సుమారు 500 మంది వలసకార్మికుల పిల్లలకు బోధన అందించి తనదైన తల్లి పాలనతో ఆకట్టుకుంటున్నారు.

అమ్మకు ఆరోగ్యం.. పిల్లలకు చదువు..