ఐపీఎస్‌ల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ల బదిలీలు

Mar 8 2025 1:28 AM | Updated on Mar 8 2025 1:25 AM

● రామగుండం సీపీగా అంబర్‌ కిశోర్‌ ఝా ● కరీంనగర్‌ సీపీగా గౌస్‌ ఆలం ● సిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం పోలీస్‌ కమి షనర్‌గా అంబర్‌ కిశోర్‌ఝాను నియమించింది. రా మగుండం సీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సీఐడీ ఐజీగా బదిలీచేశారు. కరీంనగర్‌ సీపీగా గౌస్‌ ఆలంను నియమించగా, ఇక్కడ పనిచేస్తున్న అభిషేక్‌ మ హంతిని తెలంగాణ క్యాడర్‌ నుంచి రిలీవ్‌ చేశారు. సిరిసిల్ల ఎస్పీగా మహేశ్‌బాబాసాహెబ్‌ను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న అఖిల్‌మహాజ న్‌ను ఆదిలాబాద్‌ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న పి.కరుణాకర్‌ను పెద్దపల్లి డీసీపీగా నియమించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతన హైదరాబాద్‌లోని ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయ్యారు.

అంబర్‌ కిశోర్‌ ఝా..

2009 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అంబర్‌ కిశోర్‌ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్‌ ఏఎస్పీగాను, 2012 వరంగల్‌ ఓఎస్డీ, అదనపు ఎస్పీగాను పనిచేయడంతో పాటు 2014లో వరంగల్‌ ఎస్పీగానూ పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. 2013 అక్టోబరులో వరంగల్‌ కమిషనర్‌గా పనిచేశారు.

గౌస్‌ ఆలం..

2017 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆదిలాబాద్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్‌ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. అంతకుముందు అక్కడే ఓఎస్‌డీగా విధులు నిర్వర్తించారు. కాగా.. అంతకుముందు ఏటూరునాగారంలో అడిషనల్‌ ఎస్పీగా పనిచేశారు. ఈయన బిహార్‌ రాష్ట్రంలోని గయాకు చెందినవారు. ఐఐటీ ముంబాయ్‌లో గ్రాడ్యుయేట్‌ పట్టా పొందారు.

గిటే మహేశ్‌

2020 బ్యాచ్‌కు చెందిన గిటే మహేశ్‌ అహమదా బాద్‌ వాసి. తల్లిదండ్రులు కౌలు రైతులు. అగ్రికల్చ ర్‌ గ్రాడ్యుయేట్‌ అయిన మహేశ్‌ది పేద కుటుంబమైనా కష్టపడి చదివి ఐపీఎస్‌ సాధించారు. తెలంగా ణకు కేడర్‌కు కేటాయించాక.. కరీంనగర్‌లో ట్రైనీగా విధులు నిర్వహించారు. చొప్పదండి ఎస్‌హెచ్‌వోగా ఆరునెలలపాటు పనిచేశారు. ఆయన ప్రస్తుతం ములుగు ఓఎస్డీగా ఉన్నారు. ఈయనకు ప్రస్తుతం సిరిసిల్ల ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.

ఐపీఎస్‌ల బదిలీలు1
1/3

ఐపీఎస్‌ల బదిలీలు

ఐపీఎస్‌ల బదిలీలు2
2/3

ఐపీఎస్‌ల బదిలీలు

ఐపీఎస్‌ల బదిలీలు3
3/3

ఐపీఎస్‌ల బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement