
ఆదర్శ దంపతుల స్ఫూర్తిదాయక నిర్ణయం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఉల్లిగడ్డల బజార్‌లో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న కొత్త చంద్రప్రసాద్–వరలక్ష్మి దంపతులు బుధవారం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా తమ మరణానంతరం ఇద్దరి నేత్రాలు, అవయవాలు, దేహదానాలు చేస్తామని అంగీకారం ప్రకటించారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ముఖ్య సలహాదారు, ఎస్‌ఎంఎస్ ప్లాంట్ ప్రాజెక్ట్ మాజీ ఆఫీసర్ నూక రమేశ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాసుకు తమ అంగీకారపత్రాలు అందజేశారు. దంపతులకు ప్రతినిధులు అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చంద్రప్రసాద్ తల్లిదండ్రులు కొత్త రాజయ్య–వజ్రమ్మతోపాటు బంధువులు గుండా శంకరయ్య, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానానికి అంగీకారం