మంథని: చెక్‌డ్యాంలతో అనేక ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో నిర్మిస్తే మంథని ఎమ్మెల్యే, రా ష్ట్రమంత్రి వాటిపై రాద్ధాంతం చేశారని మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధు విమర్శించారు. చెక్‌డ్యాంలు వేస్టు అని అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడం శోచనీయమన్నారు. అడవిసోమన్‌పల్లి వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంను మంగళవారం మధు సందర్శించా రు. చేపలు పడుతున్న మత్స్యకారులను కలిసి ఉపా ధి గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధు మాట్లాడుతూ అప్పటిముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనతో అడవిసోమన్‌పల్లి గ్రామంలోని మానేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ వాళ్ల ప్రయోజనాలకే దానిని నిర్మించారని, సైంటిఫిక్‌గా నిర్మించలేద ని మంత్రి రకరకాలుగా మాట్లాడారని దుయ్యబట్టారు. చెక్‌డ్యాంతో భూగర్భజలాలు వృద్ధి చెందాయని, మత్స్య సంపదతో అనేక కుటుంబాలు ఉ పాధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. అడవి సోమన్‌పల్లితోపాటు ఇతర గ్రామాలకు చెందిన మ త్స్యకారులు ఇక్కడ చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నారని ఆయన అన్నారు. దీనిపై మంత్రి ఏమని సమాధానం చెప్తారని మధు ప్రశ్నించారు.