బల్దియా వాహనాల్లో కదలిక | - | Sakshi
Sakshi News home page

బల్దియా వాహనాల్లో కదలిక

Mar 4 2025 12:31 AM | Updated on Mar 4 2025 12:29 AM

● పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన ఇంజినీర్‌ ● మరమ్మతు అంచనాకు క్షేత్రస్థాయిలో తనిఖీలు

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నాలుగేళ్లుగా మూలన పడేసిన పారిశుధ్య వాహనాలకు ఎట్టకేలకు ‘సాక్షి’ కథనంతో కదిలిక వచ్చింది. ‘బల్దియాకు నిర్లక్ష్యపు తుప్పు’ శీర్షికన గతనెల 7న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ స్పందించి.. వాహనాలపై ఆరా తీశారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇవి పనిచేయకపోవడానికి కారణాలు? మరమ్మతు సమస్యలు ఉన్నవి, అవసరమైన విడిభాగాలు.. తదితర వివరాలు తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఇంజినీర్‌ అమీర్‌, వరంగల్‌కు చెందిన మరో ఇంజినీర్‌ రాజు క్షేత్రస్థాయిలో వాహనాలను తనిఖీ చేశారు. బల్దియా కార్యాలయం ఆవరణలో మూలన పడేసిన వాహనాలతోపాటు గౌతమినగర్‌లోని డీఆర్‌సీ కేంద్రంలోని ట్రక్‌ మౌంటెడ్‌ గార్బేజ్‌ కంపాక్టర్‌, జెట్టింగ్‌ మిషన్‌, స్వీపింగ్‌ మిషన్‌, పోర్టేబుల్‌ స్టాటిక్‌ కంపాక్టర్‌, హుక్‌ లోడర్‌ తదితర ఆధునిక యంత్రాలు, వాహనాలను పరిశీలించారు. మరమ్మతు కు కావాల్సిన సామగ్రి కోసం వివరాలను నమో దు చేసుకున్నారు. ఢిల్లీ వారికి చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఇంజినీర్లతో చర్చించి అంచనాలను రూపొందించి, మున్సిపల్‌ కమిషనర్‌కు త్వరలోనే సమర్పిస్తామని ఇంజినీర్‌ తెలిపారు.

బల్దియా వాహనాల్లో కదలిక1
1/1

బల్దియా వాహనాల్లో కదలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement