రామగుండం: జెన్‌కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటి ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక జెన్‌కో అతిథి గృహంలో యూనియన్ రీజినల్ నూతన కార్యవర్గాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మి క సంఘాల జేఏసీ పోరాట ఫలితమే జెన్‌కోకు కొత్త విద్యుత్ ప్రాజెక్టు దక్కిందన్నారు. అనంతరం రామగుండం థర్మల్ స్టేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎండీ సలీం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ ఆరీఫ్, రీజినల్ కార్యదర్శిగా ముక్కెర శ్రీనివాస్, అదనపు కార్యదర్శిగా ఆడెపు శ్రీనివాస్‌ను నియమించారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెం సుధీర్, జెన్‌కో అధ్యక్షుడు కోటేశ్వరరావు, అదనపు కార్యదర్శి కుశలవరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రమేశ్, బిచ్చా తదితరులు పాల్గొన్నారు.