
గోదావరిఖని: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై అభ్యర్థులు ఇప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా రామగుండంలో పోలింగ్‌శాతం విభిన్నంగా ఉంటోంది. ఈసారి నియోజకవర్గంలో 2,14,974 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఇందులో 60శాతంకన్నా ఎక్కువగా ఓట్లు పోలైయ్యే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఈలెక్కన సుమారు 1.20లక్షలపైగా ఓట్లు పోలయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. నియోజకవర్గంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రామగుండం మండలంలో ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగుల ఓట్లు ఈ మండలంలోనే ఎక్కువగా ఉన్నాయి. మాంచస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఈప్రాంతంలో అత్యధికమంది సమీప ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకుని రామగుండంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా సంస్థలో ప్రతినెలాఖరున కార్మికుల ఉద్యోగవిరమణ చేయడం, వారు ఇక్కడి క్వార్టర్ ఖాళీ చేసి వెళ్లిపోవడం సర్వసాధారణం. ఇక్కడ నమోదైన ఓట్లు అలాగే ఉండటం, రిటైర్ అయి వెళ్లిపోయిన ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో ఈప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని అధికారులు భావిస్తున్నారు.
నియోజకవర్గం ఆవిర్భావం నుంచి..
● రామగుండం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఓటింగ్ సరళి పరిశీలిస్తే.. 2009లో 51శాతం, 2014లో 61,87శాతం, 2018లో అత్యధికంగా 71.94శాతం పోలింగ్ నమోదైంది.
● గతంతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం సరాసరి 60శాతం నుంచి 65శాతం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు.
● మరోవైపు.. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి 26మంది పోటీలో ఉండే అవకాశం ఉంది.
● ఇందులో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
● అయితే, ఓట్లు చీల్చితే 50వేలకుపైగా లేదా 65వేలకు లోపు ఓట్లు సాధిస్తే విజయం కై వసం చేసుకుంటామనే అంచనాల్లో అభ్యర్థులు తలమునకలైయ్యారు.
● దీనికోసం కచ్చితంగా ప్లాన్ చేసుకుంటూ మెజార్టీపై దృష్టి పెట్టారు.
● అయితే మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా రిటైర్డ్ కార్మికుల స్థానంలో యువకార్మికులు ఉద్యోగాల్లో చేరడంతో కొంతమేర ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అంచనాల్లో మునిగితేలుతున్న అభ్యర్థులు
గతంలో పోలింగ్ శాతం తక్కువే
ఈసారి ఓటుబ్యాంకుపై ప్రత్యేక దృష్టి
సంవత్సరం పోలైన ఓట్లు శాతం
2018 1,36,140 71
కోరుకంటి చందర్(ఏఐఎఫ్‌బీ) 61,400
ఎస్.సత్యనారాయణ(టీఆర్‌ఎస్) 34,941
మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్ 27,181
సంవత్సరం పోలైన ఓట్లు శాతం
2014 1,37,638 61.87
ఎస్.సత్యనారాయణ(టీఆర్‌ఎస్) 35,789
కోరుకంటి చందర్(ఏఐఎఫ్‌బీ) 33,494
బాబర్‌సలీంపాషా(కాంగ్రెస్) 16,900
సంవత్సరం పోలైన ఓట్లు శాతం
2009 1,19,051 58.10
ఎస్.సత్యనారాయణ(స్వతంత్ర) 32,479
కౌశిక్ హరినాథ్(ప్రజారాజ్యం) 30,259
బాబర్ సలీంపాషా(కాంగ్రెస్) 23,283
కోరుకంటి చందర్(టీఆర్‌ఎస్) 15,984