బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.. ఫిర్యాదు చేసేవారిపైనా బెదిరింపులేనా?

న్యూస్‌రీల్‌

ఆడబిడ్డలకు భరోసా ఏదీ?

ఆర్తనాదాలు వినిపించడంలేదా?

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

నిందితులకు అండదండలా?

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మజ

పార్వతీపురం రూరల్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని, నిత్యం జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వై.ఎస్‌.జగనన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో మహిళా నేతలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మజ మాట్లాడుతూ ఇటీవల గుంటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో మహిళలను వివస్త్రలను చేసిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయని, బాధిత మహిళలకు రక్షణ కవచంలా నిలవాల్సిన పోలీస్‌ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం శోచనీయమన్నారు. నేరస్తులకు కొందరు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడం వల్లే దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసుల నమోదులో జాప్యం, విచారణలో ఉదాసీనత ప్రదర్శిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరిచి మహిళా పోలీస్‌ స్టేషన్లు, పెట్రోలింగ్‌ బృందాలు, హెల్ప్‌లైనన్‌ వ్యవస్థలను సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దోషులపై ఉక్కుపాదం మోపి, కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమని, జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, ఎంపీపీ బలగ రమణమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండి భాగ్యవతి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దాసరి నాగరత్నం, మాజీ దాసరి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రంగుముద్రి రమాదేవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, సాలూరు నియోజకవర్గం జిల్లా జనరల్‌ సెక్రటరీ దండి శ్రీనివాసరావు, నియోజకవర్గం ఎస్టీసెల్‌ అధ్యక్షుడు నెమలిపిట్ట కళ్యాణ్‌, పట్టణ మహిళా అధ్యక్షురాలు రాంబాయి, పాచిపెంట ఎంపీపీ ప్రమీల, నాయకులు, మదల సత్యవతి, ప్రియాంక, దండి అనంత కుమారి, అల్లు సత్యవతి, మారడాన పద్మావతి, కురూపం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు గొర్ల సుజాత, నియోజకవర్గం ఐటీ వింగ్‌ అధ్యక్షులు ఇత్తిలి మణి, జిల్లా మహిళా విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ బలివాడ ఉమాదేవి, జి.విద్యారాణి, ఎన్‌.శీల, పాలకొండ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు జంపు కన్నతల్లి, విజయ కుమారి, నల్లబిల్లి సుహాసిని, నాలుగు నియోజకవర్గాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గుంటూరు, బద్వేలు లాంటి ప్రాంతాల్లో జరిగిన అమానవీయ ఘటనలు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యాలు. పగటిపూట ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయే దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ఇప్పటికై నా కూటమి నాయకులు కళ్లు తెరవాలి.

– దాసరి నాగరత్నం, పార్వతీపురం నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడా మహిళలకు భద్రత లేదు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా బాధితులకే బెదిరింపులు ఎదురవుతున్న దారుణ పరిస్థితులు చూస్తున్నాం. ఈ అరాచక పాలన అంతమయ్యే వరకు బాధితుల తరఫున నినదిస్తాం.

– బలగ రవణమ్మ, ఎంపీపీ, సీతానగరం

ప్లకార్డుతో నిరసన

కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు

పచ్చసైకోల అరాచకాలపై చర్యలేవీ?

రెడ్‌బుక్‌ పాలన మాకొద్దంటూ నిరసన

రాష్ట్రంలో పెరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ

మహిళల భద్రత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలన్నీ నేడు నిర్వీర్యమయ్యాయి. మహిళా పోలీస్‌ స్టేషన్లు, పెట్రోలింగ్‌ బృందాలు, హెల్ప్‌లైన్లు ఏమాత్రం పనిచేయడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ వ్యవస్థలను బలోపేతం చేసి, ఆడబిడ్డలకు భరోసా కల్పించాలి. – సీహెచ్‌ శశి,

నర్సిపురం, పార్వతీపురం మండలం

కూటమి పాలకులకు మహిళల ఆర్తనాదాలు వినిపించడం లేదు. వివస్త్రలను చేసి అవమానిస్తున్న ఘటనలు నాగ రిక సమాజానికే తలవంపులు తెస్తున్నాయి. దోషులను ఉరితీయాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తగిన బుద్ధిచెప్పే రోజు ఎంతోదూరంలో లూదు.

– సుహాసిని,

వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా జనరల్‌ సెక్రటరీ

రాష్ట్రంలో పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిపోయింది. పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి అఘాయిత్యాలపై కేసుల నమోదులో తీవ్ర జాప్యం చేస్తోంది. చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ స్ఫూర్తిని మర్చిపోవడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.

– ప్రమీల, పాచిపెంట ఎంపీపీ

మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు, నిందితులకు అండదండలు అందించడం విచారకరం. దోషులను రక్షించే ప్రయత్నం చేస్తే మహిళాలోకం చూస్తూ ఊరుకోదు.

– శెట్టి పద్మావతి,

ఎంపీపీ, కురుపాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement