సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

●మండుతున్న ఎండలు ●ఉదయం 8 గంటలకే సెగలు కక్కుతున్న సూరీడు ●అవస్థలు పడుతున్న జనం ●వృద్ధులు, పిల్లలు అల్లాడుతున్న వైనం ●ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

న్యూస్‌రీల్‌

వడదెబ్బకు గురయ్యే అవకాశం

ఎండలో తిరగరాదు

విజయనగరం ఫోర్ట్‌:

ప్రిల్‌ తొలి వారంలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమికి వేడుగాలులు వీస్తుండడంతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకునే వారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మొండి ధైర్యంతో ఎండలోనే పనులు చేస్తున్నారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉదయం 6 గంటలకే..

ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం వేతనదారులు ఉదయం 6 గంటలకే పనికి వెళ్లి 10 గంటలకు తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు. పని ప్రదేశంలో తాటి కమ్మలతో టెంట్లు వేసుకున్నా.. భానుడి ప్రతాపం ముందు నిలబడటం లేదు. గీత కార్మికులు సాధారణంగా కళ్లు గీయడానికి మధ్యాహ్నాం వెళ్లేవారు. ఎండ తీవ్రతకు భయపడి వారు వెళ్లడం లేదు. జిందాల్‌, మహామాయ వంటి పరిశ్రమలలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఎండ వేడి తోడవ్వడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటుక బట్టీ కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు పరిస్థితి చెప్పనక్కర్లేదు.

జనం అవస్థలు

ఉదయం 8 గంటలకే ఎండ సెగలు కక్కుతుండడ తో ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఒకే విధంగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు.

ఓ వైపు భగభగలు.. మరోవైపు ఉక్కపోత

ఏప్రిల్‌ మొదటి వారంలోనే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజువారి కూలీల పరిస్థి తి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఇంకోవైపు ఉక్కపోత కూడా ఎక్కువైంది. దీంతో ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోతతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అల్లాడిపోతున్నారు.

శీతల పానీయాలను డిమాండ్‌

ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి జనం శీతల పానీయాలకు ఆశ్రయిస్తున్నారు. సరబత్‌, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే విధంగా మంచినీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం, మజ్జిగ వంటివి తీసుకుంటున్నారు.

గొడుగు నీడలో ఇలా...

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఎండలో తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, వణుకు పుట్ట డం, మగతనిద్ర, కలవరింతలు, ఫిట్స్‌, పాక్షికంగా అపస్మాకర స్థితి వడదెబ్బ లక్షణాలు గా ఉంటాయని ఈ లక్షణాలు కనపడితే వెంట నే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటలలోపు పనులు ముగించుకోవాలి. 11 గంటల తర్వాత ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో టోపీ ధరించాలి, గొడుగు పట్టుకుని వెళ్లాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. వడదెబ్బ నీళ్లు లక్షణాలు కనిపిస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి.

– డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి,

డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement