రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజు లుగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హ్యాక్‌థాన్ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. మొత్తం 290 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏకధాటిగా 18 గంటలు శ్రమించి వ్యాపారం, ప్లేస్‌మెంట్, ఆరోగ్యం, సామాజిక సంక్షే మ రంగాలకు సంబంధించి వినూత్న ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదు జట్లుకు రూ.2లక్షల నగదు బహుమతి ప్రధానం చేశారు. ఇటువంటి హ్యాక్‌థాన్లు విద్యార్థుల నైపుణ్యంతో పాటు పరిశ్ర మస్థాయి అనుభవాలను అందిస్తాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఐటీడీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్, మైక్రోసాఫ్ట్ ఏఐ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రవితేజ, బి.సౌమ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


