నేటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం ప్రభుత్వ నిర్లక్ష్యంపై టీచర్ల ఆగ్రహం నల్ల బ్యాడ్జీలతో మూల్యాంకనానికి హాజరుకానున్న ఉపాధ్యాయులు
స్పాట్ సెంటర్లలో నిరసనలు
విజయవాడలో రిలే నిరాహార దీక్షలకు సిద్ధం
కొన్నేళ్లుగా ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా టీచర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. తాజాగా ఉపాధ్యాయులు చేపడుతున్న మూల్యాంకన విధులను నల్ల బ్యాడ్జీలతో చేపట్టి నిరసనలు తెలపాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహించి తొలిత ఈ రూపంలో నిరసనలు తెలుపుతాం. పెండింగ్ డీఏలు వంటి ఆర్థిక బకాయిల చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
– పాలతేరు శ్రీనివాస్, జిల్లా చైర్మన్,
ఫ్యాప్టో జిల్లా కమిటీ
బోధనేతర పనులతో నిత్యం బిజీగా ఉంటూ బోధన తరగతులను నిర్వహించలేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ఏర్పడింది. హైస్కూళ్లలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజ న పథకం పరిశీలన, డేటా ఎంట్రీ, సర్వే తదిత ర పనులతో బిజీగా ఉండటంతో తరగతులు సమగ్రమంగా నిర్వహించలేకపోతున్నాం. దీని వల్ల విద్యార్థుల హాజరు తగ్గినట్టు గుర్తించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– డి.శ్యాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ
విజయనగరం అర్బన్:
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసినా ఫలి తం లేకపోవడంతో తాడోపేడే తేల్చుకునేందుకు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. గతేడా ది అక్టోబర్‌లో విజయవాడ ధర్నా చౌక్‌లో ఐక్య పో రాటానికి ప్రభుత్వం దిగొచ్చి ఒక డీఏను విడుదల చేసి చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే మలిదశ ఉద్యమంగో భాగంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగ తి మూల్యాంకనానికి నల్ల బ్యాడ్జీలతో హాజరు కావాలని నిర్ణయించింది. ఈ నెల 9న స్పాట్ కేంద్రంలో, ఈ నెల 25, 26, 27న విజయవాడలోని ధర్నాచౌక్‌లో చేపట్టనున్న మూడు రోజుల రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభు త్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆ కార్యాచరణ నిరసనలు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో జిల్లా కమిటీ ప్రకటించింది.
టీచర్లకు ఇవ్వాల్సిన డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల తో పాటు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయకపోవడం. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించకపోవడం. సీపీఎస్ రద్దుపై స్పష్టత లేపోవ డం. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరగడం. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం. బదిలీల వ్యవస్థలో గందరగోళం. ఈహెచ్‌ఎస్, మెడికల్ బిల్లుల సమస్యలు, పాఠశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం.
ఫ్యాప్టో పిలుపుతో ఆందోళనలు ఉధృతం
ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం స్థానిక సంస్కృత ఉన్నత పాఠశాలలో జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. జిల్లా చైర్మన్ పాలతేరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించిన దశలవారీ ఆందోళన కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం కార్యాచరణ నోటీసును డీఈఓ యు.మాణిక్యంనాయుడుకి అందజేశారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ సీహెచ్ భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్, శివప్రసాద్, ఎన్‌వీ పైడిరాజు, జి.సూర్యనారాయణ, అప్పారావు, సీహెచ్ తిరుపతిరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


