పార్వతీపురం రూరల్: సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆర్‌ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


