● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఓ ప్లాంట్ లేని పాఠశాలలు, వసతిగృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది సుధీర్ఘ ఎల్‌నినో ప్రభావం వల్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, డీపీఓ మల్లికార్జునరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.


