● గూగుల్‌కు ఎంపికై న వడమ కుర్రాడు
● రూ.కోటి వార్షిక జీతానికి ఎంపిక
● ఆనందంలో తల్లిదండ్రులు
పాలకొండ రూరల్: ఆ కుర్రాడు పట్టుదలతో చదివాడు. ఓ వైపు ఉన్నత విద్య అభ్యసిస్తూనే సాంకేతిక అంశాలపై పట్టుసాధించాడు. గూగుల్‌లో రూ.కోటి వార్షిక వేతనానికి ఎంపికై తల్లిదండ్రుల్లో ‘సంతోష్’ం నింపాడు. చదువుతోనే భవిత అన్నది నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ నగర పంచాయతీ వడమ గ్రామానికి చెందిన బొద్దాన కళ్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడు సంతోష్. తండ్రి గ్యాస్ స్టౌవ్‌లు బాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తనవలే పిల్లలు కాకూడదని రెక్కల కష్టంతో పిల్లలను చదివించారు. చదువు విలువ తెలిసిన సంతోష్ ఉన్నత లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారు. రాజాం జీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా బెంగుళూరులో ఉద్యోగప్రస్థానం ఆరంభించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 20కి పైగా సర్టిఫికేషనన్ కోర్సులు పూర్తి చేశారు. తల్లిదండ్రుల కోరికకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్)గా ముంబయిలో ఉద్యోగంలో చేరారు. అనంతరం బాస్కో లో రీసెర్చ్ విభాగంలో చేరి పలు రిసర్చ్ పేపర్ల పేటెంట్స్‌ను సంతోష్ ప్రచురించారు. జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో తన ప్రాజెక్టులను ప్రజెంట్‌చేసి ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డులను అందుకున్నారు. బాస్కో కంపెనీలో ఉద్యోగం చేస్తూనే బెంగళూరులో ప్రఖ్యాత ఐఐ ఎస్‌సీ కాలేజీలో డేటా సైంటిస్ట్ కోర్సులో ఎంటెక్ పూర్తి చేశారు. ఈ క్రమంలో గూగుల్‌లో అవకాశం కోసం ఖాళీ సమయంలో కష్టతరమైన డేటా స్ట్రక్చర్స్‌తో కూడిన 500కు పైగా లీడ్ కోడ్ సమస్యలతో కోడింగ్ సాధన చేసి గూగుల్ కొలువుపై దృష్టి పెట్టారు. అనుకున్నట్లుగానే గత ఫిబ్రవరి 25న గూగుల్ నుంచి పిలుపు రాగా ఇటీవల జరిగిన పది రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తమ ప్రతిభ కనబర్జి ఉద్యోగాన్ని సంపాదించారు. రెండు రోజుల కిందట గూగుల్‌లో చేరినట్టు మంగళవారం రాత్రి మీడి యాకు సంతోష్ తెలిపారు. నేర్చుకోవాలనే తపన, నిరంతరమైన ప్రణాళికతో కూడిన శ్రమ, తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహమే విజయానికి కారణమని పేర్కొన్నారు.


