సీతం క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌కు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సీతం క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌కు గుర్తింపు

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

ప్రతిష్టాత్మక కోర్సుకు నలుగురు ఎంపిక

సుమారు 67 వేల మంది విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కేవలం 3 వేల మందిని మాత్రమే ఈ ఉన్నత స్థాయి కోర్సులకు ఎంపిక చేయడం విశేషం. ఎంపికై న సభ్యులు సీతం క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం కంప్యూటింగ్‌ శిక్షణా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తమ నిబద్దతను చాటుతున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉన్న క్వాంటం కంప్యూటింగ్‌ రంగంలో ముందంజలో నిలవడానికి సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రామమూర్తి, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ వీజీప్రసూన, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ జి.వేణుమాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌: స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాల క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌కు గౌరవం దక్కింది. ఆ కేంద్రానికి చెందిన నలుగురు సభ్యులు వైజర్‌, క్యూబైటెక్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక క్వాంటం అల్గారిథమ్స్‌ కోర్సుకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో మొదటి సంవత్సరం విభాగాధిపతి డాక్టర్‌ కె.శ్రీలత, గణితశాస్త్ర విభాగం అసొసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.శ్రీచందన్‌, సీఎస్‌ఈ చివరి సంవత్సరం విదార్థిని ఎం.త్రివేణి, విద్యార్థి సి.పూర్ణచంద్ర శేఖర్‌ ఉన్నారు. అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవతో వైజన్‌, క్యూబైటెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం ఫండమెంటల్స్‌ ఈ నలుగురు విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పొందిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement