కాలిన గాయాలతో వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలిన గాయాలతో వృద్ధుడి మృతి

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

మృతిపై అనుమానాలు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీం, డీఎస్పీ

సంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) మంగళవారం కాలిన గాయాలతో పొలంలో శవమై కనిపించాడు. ఎస్సై ఆర్‌.గోపాలరావు తెలిపిన వివరాలు.. జోగులు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళవారం పుల్లిట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వచ్చి జోగులు పొలం కాల్చడం వలన తన పొలం కూడా కాలిపోయిందని తెలపడంతో కుటుంబీకులు వెళ్లి వెతకగా అక్కడ కాలిన గాయాలతో జోగులు చనిపోయి కనిపించడంతో కుమారుడు చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి క్లూస్‌ టీం వచ్చి ఆధారాలు సేకరించి వెళ్లింది. ఇదిలా ఉండగా మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది సహజ మరణమా? ఇంకేదైనా కారణం ఉందా.. అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘువులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఆయన వెంట రాజాం టౌన్‌ సీఐ, చీపురుపల్లి సీఐ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement