అయినవారికే కట్టబెట్టి.. ఆశలకు గండికొట్టి! | - | Sakshi
Sakshi News home page

అయినవారికే కట్టబెట్టి.. ఆశలకు గండికొట్టి!

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

అయినవారికే కట్టబెట్టి.. ఆశలకు గండికొట్టి! ● ఆశ కార్యకర్తల నియామకాల్లో అవకతవకలు ● ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే పోస్టింగులు ● కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న బాధితులు నిరుద్యోగ మహిళల ఆశలపై నీళ్లు..

● ఆశ కార్యకర్తల నియామకాల్లో అవకతవకలు ● ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే పోస్టింగులు ● కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న బాధితులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

శ వర్కర్ల నియామకాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారని.. అర్హతలను పక్కన పెట్టి, అయినవారికి పోస్టులు కట్టబెట్టారని బాధిత మహిళలు గగ్గోలు పెడుతున్నారు. నిబంధనలను పక్కనపెట్టేసి, మెరిట్‌ ప్రాతిపదికన కాక.. ‘సిఫారసు’ లేఖలకే వైద్యారోగ్య శాఖాధికారులు ప్రాధాన్యమిచ్చార ని వాపోతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై డీఎంహెచ్‌ఓ కార్యాలయం, కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

దాదాపు ఎనిమిది నెలల కిందట జిల్లాలోని పలు పీహెచ్‌సీల పరిధిలో సుమారు 34 ఆశ వర్కరు పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖాధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నెలలు గడిచిన తర్వాత.. ఉద్యోగాల వేడి చల్లారాక, ప్రస్తుతం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా భర్తీ చేపడతామని ప్రకటించిన వైద్యారోగ్య శాఖాధికారులు.. ప్రజాప్రతినిధులు పంపిన జాబితాలకే సంతకం పెట్టారు. అర్హతలు, మెరిట్‌ను కాదని.. ఎమ్మెల్యేల మాటకే ఓటేశారు. స్థానికేతరులకు, ఉద్యోగస్తుల భార్యలకు కట్టబెట్టారు. మెరిట్‌ ఉన్నా.. వితంతువులైనా సరే పక్కనపెట్టేశారు.

సాలూరు నియోజకవర్గం తోణాంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వితంతు మహిళ సవిరి సుజాత ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను కాదని, అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యను నియమించారు. తన దీన స్థితిని వివరిస్తూ.. గతంలో ఆమె స్థానిక మంత్రి సంధ్యారాణి, జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కూడా కలిసి విన్నవించుకున్నట్లు తెలు స్తోంది. ఆమె ఆవేదనను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేల సిఫారసు ఉన్నవారికే పోస్టులు దక్కాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులకు అన్యాయం చేశారని వాపోతున్నారు.

●ఆశ వర్కర్‌ నియామకంలో తనకు అన్యాయం చేశారని పత్తిక కళావతి అనే గిరిజన అభ్యర్థిని వాపోయింది. కలెక్టర్‌ ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. కురుపాం మండలం బియ్యాలవల స పంచాయతీ సూర్యనగరం ఆశ కార్యకర్త పోస్టుకు సంబంధించి మెరిట్‌ ఉన్న వారికి మొండి చేయి చూపారని ఆమె చెబుతోంది.

●కురుపాం మండలం ఉదయపురం ఆశ వర్కరు పోస్టును స్థానికేతర అభ్యర్థికి ఇచ్చారని ఆ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ ఊలక భూషణరావు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement