ఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా పూర్ణిమ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా పూర్ణిమ

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

ఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా పూర్ణిమ విద్యార్థుల భవితకు కెరీర్‌ ఫెస్ట్‌ ● డీఈఓ బ్రహ్మాజీ హెల్మెట్‌ ధారణతో ప్రాణ రక్షణ ● విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్‌ జట్టి

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా స్వర్ణ గ్రా మం–స్వర్ణ వార్డుల అధికారిగా (డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓ) ఆర్‌.పూర్ణిమదేవి నియమితులయ్యా రు. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని డ్వామా డీడీఓ/పీడీగా పని చేస్తున్నారు. పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ విభాగంలో డీపీఓ, డీడీఓ, డిప్యూటీ సీఈఓ క్యాడర్‌ అధికారులకు ఉద్యోగోన్నతిపై సీఈఓ క్యాడర్‌ పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా జిల్లాకు పూర్ణిమదేవిని కేటాయించారు.

బలిజిపేట: విద్యార్థులు తమ భవితకు బంగారుబాట వేసుకునేందుకు కేరీర్‌ ఫెస్ట్‌ దోహదప డుతుందని డీఈఓ బ్రహ్మాజీ తెలిపారు. వంత రాం కేజీబీవీ బాలికలకు సోమవారం కెరీర్‌ ఫెస్ట్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మంచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు, వారి కెరీర్‌ ఉన్నతంగా మలుచుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి విద్యను అభ్యసించాలి, ఏ విద్యను అభ్యసిస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 సామల సింహాచలం, కేజీబీవీ ఎస్‌ఓ మధురవాణి, కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ బి.రమేష్‌, కె.శార ద, ఎస్‌.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి ప్రాణాపా యం నుంచి తమను తాము రక్షించుకోవాలని విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ‘హెల్మెట్‌ అవగాహన ర్యాలీ’ని సోమవా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... రహదారి ప్రమాదాల్లో మరణి స్తున్న వారిలో 50 శాతం మంది హెల్మెట్‌ ధరించని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ ధరించడం భారంగా కాకుండా, బాధ్యతగా భావించాలని కోరారు. ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పర్యవేక్షణ లో పట్టణంలోని చర్చి కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌, నాలుగురోడ్ల కూడలి మీదుగా పాతబస్టాండ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఐజీ హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్‌ రెడ్డి, స్థాని క సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement