●కష్టాల్లో జీవనం | - | Sakshi
Sakshi News home page

●కష్టాల్లో జీవనం

Mar 30 2026 8:50 AM | Updated on Mar 30 2026 8:50 AM

●కష్టాల్లో జీవనం ●ఏది అడిగినా.. యుద్ధం అంటున్నారు..

యుద్ధం బూచిగా చూపి నిత్యావసరాల

ధరలు పెంచేసిన వ్యాపారులు

పప్పు నుంచి నూనెల వరకు అదే తీరు

సలసల కాగుతున్న వంట నూనెల ధరలు

పామాయిల్‌ ధర లీటరుకు రూ.20 పెంపు

రిఫైండ్‌ ఆయిల్‌ ధర లీటరుకు

రూ.30 పెంపు

పట్టించుకోని పాలకులు

చోద్యం చూస్తున్న అధికారులు

ధరలు పెంచేశారు..

చర్యలు తీసుకుంటాం..

గ్యాస్‌ దొరకడం లేదు. నూనె కొనలేం. ప్రతి దుకాణంలో రేట్లు పెరిగాయి. యుద్ధం పేరుతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. ఇలా ఉంటే ఎలా బతికేది.

– ఎజ్జివరపు సత్యం, గుమ్మడాం

వ్యాపారులను ధరల పెరుగుదలపై అడిగితే యుద్ధం ప్రభావం అంటున్నారు. దీంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇలాగైతే ఎలా జీవించేది.

– బొడ్డు సన్యాసమ్మ,

విజయనగరం

విజయనగరం ఫోర్ట్‌/గంటస్తంభం:

శ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి వ్యాపారులు మార్కెట్‌లో నిత్యావసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వర కు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన పాలక ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుంది. కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు.

యుద్ధాన్ని బూచిగా చూపి..

అమెరికా – ఇరాన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్‌ అయి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. పామాయిల్‌ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్‌ ఆయిల్‌ ధర లీటరుకు రూ.30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి 20 వరకు పెంచేశారు.

ధరల కట్టడిలో విఫలం

నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్ట డి చేయాల్సిన అధికారుల పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్య క్తం చేస్తున్నారు. ఓ వైపు పాలకులు యుద్ధ ప్రభా వం ఏమీ లేదని చెబుతుంటే మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి.

కొనుగోలు చేయలేని దుస్థితి

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా.. నూనె కనీస అవసరం. నూనె లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. కొంత మంది రిఫైండ్‌ ఆయిల్‌ వాడిన వారు పామాయిల్‌తో సరిపెట్టుకుంటున్నారు.

పప్పు, నూనెల ధరలు బాగా పెంచేశారు. పది పదిహేను రోజుల కాలంలో ధరలు బాగా పెంచేశారు. ఏది కొనాలన్నా ముట్టుకుంటే షాక్‌ కొట్టే విధంగా ధరలు ఉన్నాయి. దీంతో ఇబ్బంది పడుతున్నాం.

– భవాని, గృహిని, లోతుగెడ్డ, మెంటాడ మండలం

నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం. కావాలని ధరలు పెంచిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ధరల కట్టడికి చర్యలు చేపడతాం.

– బి.రవికిరణ్‌, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement