ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

ఉచిత విద్య.. ఉత్తిదే! శాఖాపరమైన చర్యలు

న్యూస్‌రీల్‌

సగం కూడా చేరిక కష్టమే..

ఫీజులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలి

బంగారు కుటుంబాల వేడుకలు రేపు

పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బంగారు కుటుంబాలకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమవారం సంబరాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో సంబరాలలో పాల్గొనేలా ఆహ్వనించాలన్నారు. జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి వర్చువల్‌ ద్వారా ముఖాముఖి చర్చించే అవకాశం వుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, ఎంపీడీఓలు తదితరులున్నారు.

నారాయణాచార్యులకు పోలీసుల నివాళి

పార్వతీపురం రూరల్‌: ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక మహాకావ్యంగా గుర్తింపు పొందిన ‘శివతాండవం’ సృష్టికర్త పుట్టపర్తి అని పేర్కొన్నారు. 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన రచించిన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం పాఠ్యగ్రంథంగా ఎంపిక కావడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు. మహనీయుల స్ఫూర్తితో సిబ్బంది జ్ఞానాన్ని పెంపొందించుకుని, అంకితభావంతో ప్రజాసేవలో పాలుపంచుకోవాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, సీఐలు రమణమూర్తి, రమేష్‌, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు మరియు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మాతా శిశు మరణాల నివారణే లక్ష్యం

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు ఆదేశించారు. జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ఆశానోడల్‌ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణుల నమోదుతో పాటు వంద శాతం ‘అభా’ ఐడీలు సృష్టించాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు, టీనేజ్‌ గర్భాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే వివాహాలపై పోలీస్‌, ఐసీడీఎస్‌ శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. ఎంసీపీ కార్డుల నమోదు, టీకాల ప్రక్రియలో వెనుకబడిన కేంద్రాల పనితీరుపై ఆరా తీశారు. బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వందశాతం వేయించాలని, వేసవి దృష్ట్యా వడదెబ్బ నివారణకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వై.విజయమోహన్‌, జగన్మోహనరావు, సూర్యకౌశిక్‌, లీలారాణి, తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఆర్‌టీఈ(ఉచిత–నిర్బంధ విద్యాహక్కు చట్టం) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ చట్టం కింద చేరిన విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ నుంచి పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసలు చాలా యాజమాన్యాలు ప్రవేశాలకే మొండికేస్తున్నాయి. సెక్షన్‌12(1)సి ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి పిల్లలకు ఒకటో తరగతిలో ఏటా 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరి నుంచి ఫీజులు వసూలు చేయకూడదు. ఒకసారి ప్రవేశం పొందితే 8వ తరగతి వరకు ఉచిత విద్య కొనసాగుతుంది. దీన్ని చాలా యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్యూషన్‌ ఫీజు.. ఏకరూప దుస్తులంటూ...

కొన్ని పాఠశాలలు ట్యూషన్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు, ఏకరూప దుస్తులు, పుస్తకాలు తదితర పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. కాస్త ఆలస్యం చేసినా తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇవ్వకుంటే పరీక్షలకు హాజరు కానీయబోమని బెదిరిస్తున్నాయి. టీసీలు కూడా ఇవ్వలేమంటూ హెచ్చరిస్తున్నాయి. ఒకటో తరగతికి కూడా రూ.20 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆర్‌టీఈ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలను నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు జమ చేయాల్సిన మొత్తాలను ఆర్‌టీఈ పిల్లల ఫీజుల కోసం పాఠశాలల ఖాతాలకు మళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది విద్యార్థులకు పథకం అందకపోవడం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేయడంతో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల రూపంలో అందినకాడికి వసూలు చేశాయి.

చట్టం కింద ఉచిత విద్య కచ్చితంగా అందించాలి. సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, అడ్మిషన్లు ఇవ్వాలి. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

– బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఆర్‌టీఈ కింద జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ప్రకటనిచ్చారు. తొలివిడత ప్రవేశాలకు లాటరీ తీశారు. జిల్లా వ్యాప్తంగా 796 మంది దరఖాస్తు చేసుకోగా.. 408 మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొదటి విడతగా ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వారిని ఎంపిక చేశారు. రెండో విడతలో ఐదు కిలోమీటర్ల పరిధిలో వారిని ఎంపిక చేయనున్నారు. అక్రమంగా యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రవేశాలపై పడుతోంది. ఎవరూ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం తమకు చెల్లింపులు చేయడం లేదంటూ ప్రైవేట్‌ పాఠశాలలు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. ఈ కారణంగానే ఏటా ఎంపికై న వారిలో సగం మంది కూడా ప్రవేశాలు పొందలేకపోతున్నారు.

పార్వతీపురం రూరల్‌: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అటువంటి విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉన్నప్పటికీ, జిల్లాలోని కొన్ని పాఠశాలలు ట్యూషన్‌, అడ్మిషన్‌, యూనిఫాం, పుస్తకాల పేరుతో నగదు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీఈ నిబంధనలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడాన్ని యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయని రవికుమార్‌ పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో విచారణ చేపట్టాలని, అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లింపజేయాలని కోరారు. ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో ఆర్టీఈ వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అమరావతి రాజధానిపై అసెంబ్లీ తీర్మానం అంతా డ్రామా

అధికారంలోకి రామనే భయంతోనే అత్యవసర తీర్మానాలు

రెండేళ్ల కూటమి పాలనలో

అవినీతి, మోసం, మాయమాటలే..

అమరావతి పేరిట దోపిడీకి మాత్రమే వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

రాజధాని నిర్మాణానికి జగన్‌మోహన్‌రెడ్డి అడ్డు చెప్పలేదు

జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

పేద పిల్లలకు అందడం మిథ్యే..

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు

విద్యాశాఖ పర్యవేక్షణ లేదన్న ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement