ప్రత్యేక ఆకర్షణగా గోటి తలంబ్రాలు, మండపేట బొండాలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఆకర్షణగా గోటి తలంబ్రాలు, మండపేట బొండాలు

Mar 27 2026 9:24 AM | Updated on Mar 27 2026 9:24 AM

రామతీర్థంలో ఏటా జరుగుతున్న స్వామివారి కల్యాణోత్సవంలో పవిత్రంగా గోటితో సిద్ధం చేసిన కోటి తలంబ్రాలను వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా సేద్యంచేసిన వరిని గోటితో ఒలిచి తలంబ్రాలుగా సిద్ధంచేసి రామతీర్థానికి పంపించారు. మరికొంత మంది భక్తులు బియ్యపు గింజలపై జై శ్రీరామ్‌ అనే అక్షరాలు రాసి తలంబ్రాలుగా సిద్ధం చేశారు. ఎప్పటిలాగే మండపేట నుంచి కొబ్బరి బొండాలు రామతీర్థానికి చేరుకున్నాయి. మేలైన కొబ్బరి బొండాలపై సీతాసమేత రామలక్ష్మణ స్వామివారి అక్షరాలను సుందరంగా తీర్చిదిద్ది స్వామికి సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement