రైలు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

Mar 25 2026 7:17 AM | Updated on Mar 25 2026 7:17 AM

పార్వతీపురం రూరల్‌: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించకపోవడంతో అది బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే హెచ్‌సీ రత్నకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement