సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం

Feb 16 2026 7:39 AM | Updated on Feb 16 2026 7:39 AM

  సూపర్‌ సిక్స్‌ హామీలకు    మంగళం

సూపర్‌ సిక్స్‌ హామీలకు మంగళం

సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కాకమ్మ కబుర్లు, లెక్కలు చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వంలో 19 నెలల కాలంలో చేసిన అప్పులెంతో చెప్పలేని నేతలు ఉన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో కొన్నింటికి మళ్లీ మంగళం పాడేశారు. ఉద్యోగులు, రైతులు, ఆడబిడ్డలు మరోసారి మోసపోయారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌, సున్నా వడ్డీ తదితర పథకాలకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌, అన్నదాతకు అందించే సంక్షేమ పథకాల్లో, పింఛన్ల మంజూరులో ఎటువంటి స్పష్టత లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసేందుకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైంది.

– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement