నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. ఎంతో మంది నిరుద్యోగులు ఈ భృతికోసం ఎదురుచూస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలు అన్నారు. అవి కూడా లేవు. ఎక్కడో జాబ్ మేళా పెడితే సెక్యూరిటీ గార్డు పోస్టులు ఇస్తున్నారు. అవి కూడా పైవేట్ కంపెనీలవి. ఈ బడ్జెట్‌లో యువతకు పూర్తీస్థాయిలో మోసం జరిగింది.
– గార శ్రీకాంత్, బీటెక్, మందరాడ, సంతకవిటి మండలం
రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కపటప్రేమ
రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కపటప్రేమ చూపిస్తోంది. రైతులకు అన్నీ చేసేస్తాం అని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం రూ.20 వేల ఆర్ధిక సాయం చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు 10 సెంట్లు, 15 సెంట్లు భూమి ఉన్న వారికి ఎగ్గొట్టారు. అపరాలు పెసర, మినుము పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నారు.
– కోడెల శ్రీనివాస్‌రావు, రైతు సంఘం నాయకుడు, గంట్యాడ మండలం
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన
నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన


